పెద్దపులి పరుగో పరుగు…

నవతెలంగాణ హైదరాబాద్: ఒక్క ఎలుగుబంటి తప్ప… అడవిలో జంతువులకు పెద్దపులంటే హడలిపోతాయి. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. అలాంటి ఘటనే రాష్ట్ర సరిహద్దు.. మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వు కోర్‌ ఏరియాలో జరిగింది. కల్వర్టు పక్కన ఎండిన నీటి కుంటలో ఉన్న ఎలుగుబంటి వైపు పులి వెళ్లింది. అంతే.. భల్లూకం ఒక్క ఉదుటున లేచి ముందుకు నడుస్తూ పెద్దపులి కళ్లలో కళ్లు పెట్టి చూసింది. భయంతో పులి వెనక్కి ఒక్కో అడుగు వేసింది. ఎలుగుబంటి ఆ పెద్దపులిని పరుగులు పెట్టించింది. ఈ దృశ్యాల్ని జీపులో వెళుతున్న ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Spread the love