ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..

నవతెలంగాణ -అమరావతి: ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు, ప్యాలకుర్తి మధ్యలో బోల్తా పడింది. డ్రైవర్ అతి వేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధని(8) చిన్నారులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కోడుమూరు, కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love