26 మంది విద్యార్థులకు అస్వస్థత

నవతెలంగాణ పరిగి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రక్త హీనత నిర్మూలన కొరకు గురువారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేయడంతో విద్యార్థులకు అస్వస్థతకు గురి అయ్యారు.
దీనితో హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యార్థినులను తీసుకువచ్చారు. దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ఐరన్ టాబ్లెట్లు వేసుకొని సాయంత్రం సెనగలు తినడంతో గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఏర్పడి, కడుపునొప్పి, వాంతులు అయ్యాయని తెలిపారు. మొదటగా 6 మంది విద్యార్థులను తీసుకురాగా వారికి చికిత్స అందించాము, అనంతరం మొత్తం 18మంది విద్యార్థులకు చికిత్స అందించాము. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉంది. నలుగురు విద్యార్థులకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఉండడంతో కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం ఏర్పడిందని తెలిపారు. వారికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నామని, విద్యార్థులకు ఎటువంటి అపాయం లేదని తెలిపారు.

Spread the love