బయోమెట్రిక్‌తో రూ.28.96 కోట్ల నిరర్ధక వ్యయొం

–  పాఠశాల విద్యాశాఖపై కాగ్‌ అక్షింతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో సాధ్యతను అధ్యయనం చేయకుండా సాంకేతిక డేటా ఆవశ్యకతను అంచనా వేయకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుడు-విద్యార్థి హాజరును సేకరించేందుకు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థను అమలు చేసిన ఫలితంగా రూ.28.96 కోట్ల నిరర్ధక వ్యయం అయ్యిందని పాఠశాల విద్యాశాఖ తీరుపై కాగ్‌ అక్షింతలు వేసింది. 2018-19 విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు కోసం బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
విద్యా వైద్యానికి ప్రాధాన్యత కరువు
గత ప్రభుత్వ హయాంలో విద్యావైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వం విద్యావైద్య రంగాల మీద ఖర్చు విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో విద్యపై ఎనిమిది శాతం, వైద్యంపై నాలుగు శాతం మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొంది.

Spread the love