నియోజకవర్గంలో 32 రూట్లు 1,998 సిబ్బంది

– 242 పోలింగ్‌ స్టేషన్లు
– రెండు లక్షల 25 వేల 97 మంది ఓటర్లు
– డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నవతెలంగాణ-ఇల్లందు
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ఇల్లందులో సింగరేణి హై స్కూల్‌ ఆట స్థలంలో ఇవిఏం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లందు, కామేపల్లి, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాలు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో 32 రూట్‌లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల 25 వేల 97 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు లక్షా 9వేల 888, స్త్రీలు లక్ష 15వెల 205, టీజి 4, ఎన్నారై ఆరుగురు ఉన్నారు. 242 పోలింగ్‌ స్టేషన్లు, 1,998 సిబ్బందిని నియమించారు. పట్టణంలోని మెలోడీస్‌ స్కూల్లో దివ్యాంగులకు ప్రత్యేక పోలింగ్‌ బూత్‌ని ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు ఆరుగురు సిబ్బంది ఖర్చులకోసం రూ.4000 కేటాయించారు. నియోజకవర్గంలోని వివిధ పోలింగ్‌ స్టేషనులకు చేరుకోవడానికి సిబ్బందికి ఆర్టీసీ, ప్రైవేటు ఆనాలను సమకూర్చారు. భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. నియోజవర్గంలోని ఐదు మండలాలలో డిఎస్పి చంద్రభాను, సిఐ కరుణాకర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భద్రతా చర్యలలో భాగంగా 144 విదించామని ప్రతి పౌరుడు, వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్‌ నిబంధనలను విధిగా పాటించాలని కోరారు.

Spread the love