ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ
ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సోమ‌వారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు పీసీఆర్ కాల్ చేసిన‌ట్లు కేజ్రీవాల్ వ్య‌క్తిగ‌త సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కేజ్రీవాల్‌ను చంపేస్తామ‌ని బెదిరించిన వ్య‌క్తిని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కాల్ చేసిన వ్య‌క్తి మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం అత‌ను ఢిల్లీలోని గులాబీ బాగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో అత‌న్ని అరెస్టు చేయ‌లేక‌పోయామ‌ని వెల్ల‌డించారు.

Spread the love