విద్యార్థులకు గుడ్ న్యూస్. 3 రోజులు విద్యాసంస్థలకు బంద్

నవతెలంగాణ -ఢిల్లీ: ఢిల్లీలో ఉన్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింంది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జీ20 సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు, ఎల్లుండి ఢిల్లీలో జి20 సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు అగ్రదేశాల అధినేతలు. ఈ జీ 20 సమావేశాలకు 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు హాజరవుతున్నాయి. ఈ తరుణంలోనే.. ఢిల్లీలో మొదలయ్యాయి ట్రాఫిక్ ఆంక్షలు. ఈ తరుణంలోనే.. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ కార్యాలయాలు ఇటు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించేశారు. అంటే ఈ లెక్కన ఇవాళ్టి నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో ఉన్న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.

Spread the love