ఢిల్లీలో ఎడతెరిపిలేని వర్షాలు…

Heavy-Rainsనవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 151 మి.మీ వర్షపాతం నమోదైంది. 2013 జులై 21న అత్యధికంగా 124.3 మి.మీ వర్షపాతం నమోదు అయింది. దశాబ్దకాలం రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా కురుస్తోంది. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. 204.4 మి.మీ మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అతి తీవ్ర భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, అలాగే వరద ముప్పుపై వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love