ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపే చివరి అవకాశం…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు రెండవ రౌండ్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆ సమయంలో ఏమైనా పొరపాటుగా ఆప్షన్ లు ఎంచుకుని ఉంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని టీఎస్ఎల్పీఆర్బీ కల్పించింది. ఇందుకోసం చివరి తేదీని జూన్ 8 రాత్రి 8 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. టీఎస్ఎల్పీఆర్బీ తెలుపుతున్న సమాచారం ప్రకారం వీరికి ఇదే చివరి అవకాశమని తెలుస్తోంది. కాబట్టి ఈ తేదీ లోపు అభ్యర్థులు ఏమైనా తప్పుగా పెట్టుంటే తమ లాగ్ ఇన్ వివరాల ద్వారా కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించి చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత అతి త్వరలోనే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కానుంది.

Spread the love