– అక్టోబర్ 15 నుంచి నవంబర్ 18 వరకు
– ప్రచారంలో కేసీఆర్ దూకుడు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసు కుపోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తనదైన శైలి లో ప్రచారం సాగిస్తున్నారు. తెలంగా ణలోని దాదాపు సగం నియోజక వర్గా లను ఆయన చుట్టి వచ్చారు. ఎన్నికల కు ముందు ప్రారంభించినట్టే ఈ సారి ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రజాఆశీర్వాద సభలకు సీఎం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 15 నుంచి నవం బర్ 18 వరకు 60 ప్రజాశీర్వాద సభ ల్లో పాల్గొన్నారు. 33 రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్న సభ లు పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాయని భావిస్తున్నారు ప్రత్యర్థి పార్టీలకు సవాళ్లు విసురుతూ అయన తన దైన శైలిలో ఓటర్లను ఆకర్శించేం దుకు ప్రయత్నిస్తున్నారు. 60 ఏండ్లు గా జరగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించా మని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు. గత ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాలు గుర్తించాలని ప్రతి సభలో ప్రజలకు పిలుపునిస్తున్నారు.