
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా కౌండిన్య మిత్ర బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బైరగోని భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బహుజనుల కోసం పోరాటం చేసిన మహావీరుడని, వారి లక్ష్యసాధన కోసం గౌడ కులస్తులు ఐక్యతతో ముందుకెళ్లాలని అన్నారు. బహుజన రాజ్యం స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య మిత్రులు నాచగోని సత్యం గౌడ్, మంతపురి కనకయ్య గౌడ్, కోల శ్రీనివాస్ గౌడ్, బొమ్మ కంటిబాలు గౌడ్, మంతపురి రమేష్ గౌడ్,పల్లె రమేష్ గౌడ్, మేరుగు రాజు గౌడ్, కంకటి తిరుపతి గౌడ్, బూరుగు గణేష్ గౌడ్, బోల్గం భాను చందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.