
చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు గ్రామ శాఖ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కీర్తిశేషులు కామ్రేడ్ కందాల రంగారెడ్డి 40వ వర్ధంతి మహాసభ నేడు మందోల్లగూడెం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కొండె శ్రీశైలం తెలిపారు. సమావేశానికి సీపీఐ(ఎ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా అభివృద్ధి జరగలేదని కృష్ణారెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆత్మహత్యలు తప్ప అభివృద్ధి శూన్యం అని అన్నారు.రైతు భరోసా పథకాన్ని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి కొండే శ్రీశైలం మాజీ ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం సప్పిడి రాఘవరెడ్డి ఇట్టబోయిన శేఖర్ మానే శాలయ్య యాట ముత్యాలు మంద బుచ్చిరెడ్డి కొండే అంజయ్య పాపగళ్ళ శంకరయ్య కస్తూరి లింగస్వామి పాపగళ్ళ లింగస్వామి కూరేళ్ల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.