– దళిత బందు సాధన సమితి పేరునా పలువురి నిర్ణయం
– నవతెలంగాణ వార్తపై మళ్లగుళ్లాలు
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రయాణ ప్రాంగణంలో పంచాయతీలు అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక బుధవారం వార్త ప్రచురితమైంది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాన్ని సుందరీకరణ చేసినా..పంచాయతీల పేరుతో పలువురు ప్రయాణ ప్రాంగణంలో తీష్ట వేస్తుండడంతో ప్రయాణీకులు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. ఆర్టీసీ అధికారులు సత్వర చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు వినియోగంలోకి తీసుకురావాలనే సదుద్ధేశ్యంతో వార్తను ప్రచురించింది. గత ప్రభుత్వంలో దళిత బందు లబ్ధిదారులుగా ఎంపికైనా వారిలో ఒకరు స్పందించి, సామాజిక మాద్యమంలో వార్తను వైరల్ చేశారు. దళితబందు సాధన సమితి పేరునా ఏర్పాటు చేసుకున్న పలువురు కమిటి సభ్యులు ప్రయాణ ప్రాంగణంలో సమావేశం ఏర్పర్చుకుని, దళితబందు సాధనే లక్ష్యంగా కార్యచరణ రుపొందించుకున్నామని, ఎంపికైన ప్రతి లబ్ధిదారుడు రూ.500 ప్రభుత్వంపై పోరాటాల కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు దళిత బందు సాధన సమితిలోని సభ్యుడు తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బందు పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనే స్పష్టతకరువైనా, లబ్ధిదారులుగా ఎంపికైన వారు పోరాటాలు చేసి, ఏ విధంగానైనా దళిత బందు సాధించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలు రూపొందించుకోవడం విశేషం.