ఉపాధి కూలీలకు రోజుకు రూ.500 చెల్లించాలి: ఆలకుంట్ల సాయిలు 

– ఉపాధి కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా నీడను ఏర్పాటు చేయాలి 
– నీటిని అందుబాటులో ఉంచాలి 
– మెడికల్ కిట్టును వెంట ఉంచాలి
– ఉపాధి కూలీలకు నీరు నీడ మెడికల్ కిట్టు ఏర్పాటు చేయబోతే ప్రజా ఆందోళన చేపడుదాం
– ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా కోశాధికారి ఆలకుంట్ల సాయిలు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
ఎన్ఆర్ఈజీ ఉపాధి కూలీలకు రోజుకు ప్రతి ఒక్కరికి రూ.500 రూపాయలు తక్షణమే చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి ఆలకుంట్ల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలోని ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలన అడిగి తెలుసుకునే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మండు ఎండాకాలంలో విపరీతంగా ఎప్పుడు లేని విధంగా ఎండలు కొడుతున్నాయని అయినపటికీ పేద ప్రజలు ఉపాధి పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం రైతులకు కూడా కూలీలుగా మారే అవకాశం ఉందని తెలిపారు రైతులకు చేతికి పంటలు అందగా ఉపాధి దొరకగా పండిన పంటకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అందుకోసం రైతులు కూడా కూలీలుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. అందుకోసం ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక్కొక్కరికి ప్రతి రోజుకు 500 రూపాయలు చెల్లించి నిర్ణయాన్ని తక్షణమే తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు ఉపాధి కూలీ పనులు నిర్వహిస్తే 200 వస్తున్నాయని అవి సరిపోక ఎంతో ఇబ్బందుల పాలు పడుతున్నారని అన్నారు వారికి పూట గడవక పిల్లలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఏర్పడుతుందని తెలిపారు.
కూలీలకు నీడ నీరు ఏర్పాటు చేయాలని తెలిపారు కొన్ని గ్రామంలో ఉపాధి పనులు నిర్వహించి 20 రోజులు గడిచిన డబ్బులు రాక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వెంటనే డబ్బులు చెల్లించాలని అన్నారు ఉపాధి కూలీల పనులు నిర్వహించే వద్ద టెంటు నీడ లేక ఎండలో ఉంటూ అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు మరియు కనీసం నీటి వసతి కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చెందారు. అనుకోకుండా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరుగుతే కనీసం అక్కడ కూర్చోడానికి నీడ నీరు లేక ఉపాధి కూలీలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వారికి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోతే మా సంఘం నుంచి ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంటదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు సంస్థలు బలపరుస్తున్న మోకాళ్ళ మురళీకృష్ణ కుండ గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి కూలీలను అభ్యర్థించడం జరిగింది కేంద్రంలో బిజెపి పాసిస్తూ పార్టీలను ఓడించాలని తెలిపాడు ఇండియా కూటమి కలిసి వచ్చే శక్తులను ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ కొత్త మల్లారెడ్డి వెంకన్న రాములు శీను పద్మ జ్యోతి కోలా వీరయ్య పులి వెంకన్న మంచాల రామ్మలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love