6 వేల చీర కేవలం 3 వందలకే.. నకిలీ ఇక్కత్ దందాపై రెయిడ్స్

నవతెలంగాణ- హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారయ్యే.. పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.  ఎంతో ఫేమస్ అయిన ఈ చీరలు కేవలం 3 వందలకే వస్తుందని తెలిసిన మహిళలు ఊరికే ఉంటారా.. ఆయా షాపులకు క్యూ కట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా.. విజిలెన్స్ అధికారుల వరకూ చేరింది. అంత తక్కువకు ఇక్కత్ చీరలు అమ్మటమేంటీ.. దీని వెనుక ఏదో మతలబు ఉందనుకున్న అధికారు.. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని చేనేత వస్త్రాల షో రూంలపై తనిఖీలు నిర్వహించారు. 12 దుకాణాల్లో తనిఖీలు చేయగా.. అసలు విషయం బయటపడింది. నకిలీ ఇక్కత్ చీరలను తయారు చేసి.. మహిళలకు పోచంపల్లి చీరలని చెప్తూ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. నకిలీ చీరలను గుర్తించి వాటిని అమ్ముతున్న దుకాణాలకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నకిలీ చీరలు తయారు చేస్తున్న వారిని గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. పోచంపల్లి ఇక్కత్ చీరలను చేతులతో చేయాలి.. కానీ మరమగ్గాలతో నేసి అమ్ముతున్నారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న పోచంపల్లి చీరల స్థానంలో ఇలా ప్రింటెడ్ చీరలను అమ్మడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తుంటారు. చీరలకు చేతులతో రంగులు వేసే సంప్రదాయ పద్ధతినే ఇక్కత్ అని పిలుస్తుంటారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ముందే ఊహించుకొని.. దారాలకు రంగులేసి, రకరకాల డిజైన్లను నేస్తారు. ఈ పద్ధతిని రెసిస్ట్ డైయింట్ అంటారు. పురాతన పద్ధతుల్లో ఈ రెసిస్ట్ డైయింగ్ ఒకటి. పోచంపల్లి ఇక్కత్ చీరలు 1800 కాలం నుంచే ఉన్నాయని చెప్తుంటారు. కాగా.. పోచంపల్లిలో దాదాపు 10 వేల కుటుంబాల జీవన ఆధారం ఇక్కత్ చీరలు నేయడమే. ఇక్కత్‌ను ఒక చీరల్లోనే కాదు సల్వార్లు, స్కర్ట్, అనార్కలీ, లెహంగాల్లో కూడా ఉపయోగిస్తారు. చీరల ప్రామాణికతను నిర్ధారించే జియగ్రాఫికల్ ఇండికేటర్ 2005లో పోచంపల్లికి లభించింది. పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు ధరించారు. ఐశ్వర్యరాయ్ తన పెళ్లి, రిసెప్షన్‌లో పోచంపల్లి చీర కట్టుకున్నారు. ఇక్కత్ చీరలు సూరత్‌లో చాలా ఫేమస్.

Spread the love