Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం66.59 శాతం సర్‌ ‌ప్రక్రియ పూర్తి

66.59 శాతం సర్‌ ‌ప్రక్రియ పూర్తి

- Advertisement -


యాదాద్రి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికం
హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పం
రాష్ర్ట ఎన్నికల సంఘం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియ ఈ నెల 20 వరకు 66.59 శాతం పూర్తయిందని రాష్ర్ట ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంకా 33.41 శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్‌ ‌ఫారాలను పూరించి బీఎల్‌ఓలకు అందజేయాల్సి ఉందని తెలిపింది. అత్యధికంగా ‌యాదాద్రి భువనగిరి జిల్లాలో 89.42 శాతం, ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో 84.68, నల్లగొండ జిల్లాల్లో 83.62 శాతం ప్రక్రియ పూర్తయిందని ఈసీ వెల్లడించింది. అత్యల్పంగా మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 39.91 శాతం, ఆ తర్వాత హైదరాబాద్‌ ‌జిల్లాలో 41.73, రంగారెడ్డి జిల్లాలో 50.82 శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్‌ ‌ఫారాలను సమర్పించారని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -