- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ స్టేట్ బ్యాంక్ అప్రెంటిస్ నియామకాల కోసం 7,150 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేడు లాస్ట్ డేట్ ఉన్న దరఖాస్తుల గడువును జూన్ 15, 2026 వరకు పొడిగించినట్లు ఎస్బీఐ ప్రకటించింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే యువతకు ఇది మంచి అవకాశం కావడంతో ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
- Advertisement -



