- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవస్థానం ఆలయ కార్య నిర్వహణ అధికారిగా(ఈ.ఓ) భూమయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పనిచేసిన ఈఓ రమేష్ జైనూర్ మల్లన్న ఆలయానికి బాధిలీ పై వెళ్ళగా ముదోల్ మండల్ లోని దత్తాత్రేయ మందిర్ ఈఓ గా పని చేస్తున్న భూమయ్య అడెల్లి పోచమ్మ ఆలయ ఇన్చార్జి ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్ శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రంలో సీనియర్ అసిస్టెంట్ రాజేష్,ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -