Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌కు ఎంఏ బేబీ

హైదరాబాద్‌కు ఎంఏ బేబీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్య దర్శి ఎంఏ బేబీ బుధ వారం హైదరాబాద్‌కు రానున్నారు. గత నెల రెండు నుంచి ఆరో తేదీ వరకు తమిళనాడులోని మధురైలో ఆ పార్టీ అఖిల భారత మహాసభలు జరిగిన విషయం తెలిసిందే. అందులో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎంఏ బేబీ తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ, రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన హాజరవుతారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎ విజయరాఘవన్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్‌ వీరయ్య తదితరులు పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -