- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన గోడీషాల విజేందర్ (38) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది.కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం విజయేందర్ తన భార్య స్వప్నతో గోడవపెట్టుకొని, ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయినట్లుగా తెలిపారు. భార్య కాపురానికి రాదేమోని మనస్తాపం చెంది,కుటుంబ సమస్యలతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి దూలానికి త్రాడుతో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. మృతుడి భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
- Advertisement -

 
                                    