Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవీన్‌యాదవ్‌కు మజ్దూర్‌ యూనియన్‌ మద్దతు

నవీన్‌యాదవ్‌కు మజ్దూర్‌ యూనియన్‌ మద్దతు

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ మద్దతు ప్రకటించింది. సోమవారం నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ యూనియన్‌ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లో పోటీచేస్తున్న తన కుమారుడు నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపు సమకాలిన అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం మద్దతు ప్రకటిస్తూ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.కమల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మర్రి నరేందర్‌, చైర్మెన్‌ సి చెన్నారెడ్డి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -