- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డులను రెడ్డి పేట తండాకు చెందిన సలావత్ శంకర్ నాయక్ , జిల్లా విద్యాశాఖ అధికారి రాజు చేతులమీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయకులు పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



