మండల విద్యాశాఖ అధికారి రాందాస్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని పార్వతమ్మ గూడెం, రావిరాల పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ తరగతుల బోధకుల, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ రాందాస్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని రావిరాల, పార్వతమ్మ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీకి డీ.ఈ.ఓ నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయం ద్వార పరిశీలించి మెరిట్ లిస్టును పంపించారు. సంబంధిత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎంపీడీవో కార్యాలయంలో సూపరిండెంట్, ఐ సి డి ఎస్ ఏ సిడిపిఓ ల సమక్షంలో పరిశీలించి ఇంటర్వ్యూలను నిర్వహించినట్లు తెలిపారు. సంబంధిత ఇంటర్వ్యూ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించామని చెప్పారు. తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ చేపూరి రావు ఐసిడిఎస్ ఏ సి డి పి ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇన్స్పెక్టర్, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


