- Advertisement -
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కల్లుగీత కార్మికుడు కొండ వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, మండల కార్యదర్శి గుడుగుంట్ల బుచ్చి రాములు, కల్లుగీత సహకార సంఘం మాజీ డైరెక్టర్ కొండ యాదయ్య, సిఐటియు నాయకుడు ఒంటెపాక వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెపాక కృష్ణ ఉన్నారు.
- Advertisement -



