దోహా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభనకు కేవలం రెండు పరిష్కారాలు మాత్రమే వున్నాయని, అవి-అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవడం లేదా వైమానిక వాడులు ఎదుర్కొనడం ఈ రెండేనని చెప్పారు. కతార్‌లో వాణిజ్య నేతలతో మాట్లాడుతూ ట్రంప్, ఇరాన్ సమస్యను క్రూరమైన పద్ధతిలో కాకుండా తెలివైన పద్దతిలో పరిష్కరించాలని భావిస్తున్నామని చెప్పారు. తెలివిగా వ్యవహరించడమా లేక క్రూరంగా వ్యవహరించడమా ఈ రెండే మన ముందున్న ప్రత్యామ్నాయాలని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్య ఒప్పందం కుదుర్చుకోవాలని కతార్ అమీర్ షేక్ తమిన్ బిన్ హమద్ కూడా బాగా కృషి చేస్తు న్నారని, ఈ విషయంలో ఆయన నిజంగా పోరాడుతున్నారని, అందుకు ఇరాన్ కృతజ్ఞతలు చెప్పాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగిస్తున్న ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES