
నవతెలంగాణ – అశ్వారావుపేట : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల భద్రత,భరోసా కోసం కల్పించిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీని సోమవారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇంచార్జి డేగల రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం,సత్తుపల్లి,పినపాక, నియోజకవర్గం ఇంచార్జి లు మిర్యాల రామకృష్ణ,బండి నరేష్,కోఆర్డినేటర్ యార్లగడ్డ శ్రీనివాస్, ఖమ్మం నగర అధ్యక్షులు మెడ బోయిన కార్తీక్, నగర ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ,నాయకులు గరికె రాంబాబు, అశ్వారావుపేట,ములకలపల్లి,చండ్రు గొండ,దమ్మపేట,అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు వినోద్, ప్రవీణ్,నరసింహారావు, రహీమ్,కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం ఇంచార్జి డేగల రామచంద్రరావు మాట్లాడుతూ జనసేన ఒక్కరోజు అధికారంలో లేకున్నా దేశ చరిత్రలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ను కల్పిస్తున్న పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే,అంతేకాకుండా నేటి సమాజంలో రాజకీయంలో సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చే యువతకు,మహిళలకు నాయకులుగా తీర్చిదిద్దే ప్రక్రియ కేవలం జనసేన లోనే జరుగుతుంది.మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం లో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపించాలని ఈ నియోజకవర్గ ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాం.
మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి మన ప్రయత్నం ఎప్పుడూ ప్రజలకు చేరువై ప్రజా సమస్య లపై పోరాడుతూ,పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరడం జరిగింది. బండి నరేష్ గారు మాట్లాడుతూ నేటి యువత సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడం నేర్చుకోవాలి అని,నేటి రాజకీయాలపై అవగాహన ఉండాలి అని, నేటి రాజకీయ స్థితిగతులను పరిశీలించి జనసేన పార్టీకి అండగా నిలవాలని అశ్వారావుపేట నియోజకవర్గం ప్రజల్ని కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ మండల నాయకులు,వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సానుభూతి పరులు, పాల్గొన్నారు.