విద్యుత్ పోరాట అమర వీరులకు నివాళులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ బ్యాంకు ఆదేశిత విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2 వేల సంవత్సరంలో జరిగిన వీరోచిత పోరాటం పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది అని,ముగ్గురు అమరులయ్యారు, వేలాది మంది జైలు పాలయ్యారు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె పుల్లయ్య అన్నారు.సోమవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ సిపిఎం కార్యాలయం లో గంగరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ఆ పోరాట ఫలితంగా నే నేటికీ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ లాంటివి ప్రజలకు అందుతున్నాయని, మోడీ విద్యుత్ సంస్కరణలు అమలైతే విద్యుత్ రంగం ప్రైవేట్ వ్యక్తుల స్వంత ఆస్తి గా మారితే,దేశ ప్రజల భవిష్యత్తు అంధకారం గా మారుతుందని అన్నారు.వ్యవసాయానికి వినియోగించే మోటర్లు అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని రీడింగ్ ప్రకారం ఏ నెల కా నెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలని ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలని బిజెపి ప్రభుత్వం సూచిస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ పార్టీ మండల కార్యదర్శి బి.చిరంజీవి,జగన్నాథం, సీతారామయ్య, గోవిందు నిర్మల ,మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love