నవతెలంగాణ -తాడ్వాయి
నూతన వధూవరులను ఆశీర్వదించిన కలెక్టర్, ఎస్పీ సోమవారం సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట రెడ్డి సంఘ భవనంలో జరిగిన రూప, అనిల్ ల వివాహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, జిల్లా అధికారులు హాజరై అక్షింతలు వేసి నిండు నూరేళ్లు అన్యోనంగా , ఆదర్శ దంపతులుగా జీవించాలని ఆశీర్వదించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రూప ను ఐ.సి.డి.ఎస్. అధికారులు బాలసదనంలో చేర్పించి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చదివించారు. ఆమెను చూసి ఇష్టపడిన అనిల్ తో జిల్లా అధికారులు పెళ్లిపెద్దలుగా మారి వివాహము జరిపించారు. తన పెళ్ళికి జిల్లా యంత్రాంగం ముందుండి జరిపించడం చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు లేని బాధను మరిపించారని రూప అన్నారు. ఈ పెళ్లి వేడుకలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి రమ్య, ఎస్సి అభివృద్ధి అధికారి దయానంద్, సిపిఒ రాజారాం , టీఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.