యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రయివేట్ ఆపరేటర్ మృతి

నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: ఆర్జీ.2 సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆర్ వి ఆర్ కంపెనీ డ్రిల్ ఆపరేటర్ మృతి చెందాడని ఎస్సీకేఎస్ (సీఐటీయు) డివిజన్ అధ్యక్షుడు ఐలవేని భూమయ్య ఆరోపించారు.ఆర్జీ.2 ఏరియాలోని ఓసీపి-3 ఫేజ్-1 పైలట్ క్వారీ నందు సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో ప్రైవేట్ డ్రిల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న గంగా ప్రసాద్ అనే కార్మికుడు(24) డోజర్ కిందపడి మరణించారు.ఈ విషయాన్ని స్థానిక ఆర్ వీ ఆర్ కంపెనీ యాజమాన్యం బయటి తెలియకుండా పెద్దపల్లి హాస్పిటల్లో చేర్పించారు.చనిపోయిన డెడ్ బాడీని ఆర్ వి ఆర్ కంపెనీ వద్దకు తీసుకురావాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షులు ఐలవేణి భూమయ్య డిమాండ్ చేశారు. రక్షణ లేకుండా పని చేయించడం ద్వారా విశ్రాంతి లేకుండా యంత్రాలు నడపడం ద్వారా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదానికి కారణమైన ఆర్ వీ ఆర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ కార్మికునికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆ కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్ వి ఆర్ కంపెనీ, సింగరేణి యాజమాన్యాన్ని సిఐటియు డివిజన్ అధ్యక్షులు ఐలవేణి భూమయ్య,ఆర్జి 2 ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ ఉల్లి మొగిలి డిమాండ్ చేశారు.
Spread the love