అనారోగ్యంతో బాధపడుతున్న పూర్వ విద్యార్ధికి ఆర్ధిక సహాయం…

– దాతృత్వం చాటుకున్న నేటి విద్యార్ధులు,అధ్యాపకులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : సహాయం అంటే సామాజిక పరస్పర పరోపకారం‌.మాట సహాయం,చేయూత,ఆర్ధిక బరోసా ఏది ఎక్కడ చేయాలో తెలిసి ఉండటమే మానవీయతా దృక్ఫధం. అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ పూర్వ విద్యార్ధికి ఆర్ధిక చేయూత ఇవ్వాలని ఆలోచన కార్యరూపం దాల్చడం హర్షణీయం. దమ్మపేట కు చెందిన సకినాల పవన్ కుమార్ స్థానిక వి.కె.డి.ఎస్ రాజు జూనియర్,డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్ధి.ఈయన గత కొంత కాలంగా ఊపిరితిత్తులు (లంగ్) క్యాన్సర్ తో భాద పడుతూ హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకొన్న ప్రస్తుత ఇంటర్,డిగ్రీ విద్యార్థుల తో పాటు అధ్యాపకుల బృందం  ఎవరి వారు స్వీయ విరాళాలు ద్వారా సమకూరిన రూ. 28 వేల 585 లు ను పూర్వ విద్యార్థులు ఎస్.కె ఘనీ,పి.నరేంద్ర,కే.రవీంద్ర ల ద్వారా సోమవారం ఈ మొత్తం  (Rs.28,585/)ఆర్ధిక సహాయాన్ని క్యాన్సర్ బాధిత విద్యార్ధి తల్లిదండ్రులకు  అంద చేసారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషుబాబు,సుబ్బయ్య, సత్యానంద్ పాల్గొన్నారు.
Spread the love