కోడ్‌ పట్టని వైనం

– సంగారెడ్డి, సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ ప్లెక్సీలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల కోడ్‌ అమలు చేయాల్సిన అధికారుల్లో కొందరు నిర్మితంగా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కలెక్టర్ల నేతత్వంలో ఎన్నికల కోడ్‌ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఓటింగ్‌లు పెద్ద పెద్ద కటౌట్ల తొలగిచినప్పటికీ అక్కడక్కడ ఇంకా ఫ్లెక్సీలు, బోర్డులు, కటౌట్లు కనిపిస్తున్నాయి సంగారెడ్డి పట్టణంలో హైవేపై చాలాచోట్ల బీఆర్‌ఎస్‌ కు చెందిన ఫ్లెక్సీలు కట్‌అవుట్లు తొలగించకుండా అట్లనే దర్శనమిస్తున్నాయి సిద్దిపేట పట్టణంలో సైతం పలుచోట్ల టిఆర్‌ఎస్కు చెందిన ప్రచార హౌల్డింగ్లు భారీ ఫ్లెక్సీలు తొలగించుకుని నేర్చుకోలేదు ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ గోడ రాతలు పోస్టర్లు ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడంలో మున్సిపల్‌ అధికారులు అప్రవంతంగా లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వచ్చిన మరుక్షణమే కోడ్‌ అమల్లోకి వచ్చిన విషయం మూడు జిల్లాల ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు 11 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల కోడ్‌ను విధిగా అమలు చేయించాల్సి ఉన్నది. ఇప్పటికే పలుచోట్ల విగ్రహాలకు ముసుగులు వేయడం బ్యానర్లు ఫ్లెక్సీలు తొలగించడం పోస్టర్లు గోడ రాతలను తొలగించడం వంటి చర్యలను తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధాన కూడలిలోనే కాకుండా ప్రధాన రహదారుల వెంట భారీ భవనాలపై పెట్టిన హౌల్డింగ్లు ఫ్లెక్సీలను తొలగించడంలో మున్సిపల్‌ అధికారులు పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారనే విమర్శ వినిపిస్తున్నది. పార్టీలకతీతంగా ఎన్నికల కోడ్‌ అమలు చేయాల్సిన అధికారులు పూర్తిస్థాయిలో ఫ్లెక్సీలు బోర్డులను తొలగించడంలో విఫలమవుతున్నారనే మాట వినిపిస్తుంది. ఇప్పటికైనా అక్కడక్కడ కనిపిస్తున్న ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love