ఆధారాలు లేని రూ.2 .19 లక్షల నగదు స్వాధీనం 

– మూడు రోజుల్లో మొత్తం రూ.9.100 లక్షలు 
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎన్నికల నేపధ్యంలో  అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర గురువారం ఎస్.హెచ్.ఒ శ్రీకాంత్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఆధారాలు లేని రూ. 2 లక్షల 19 వేలు  నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహన దారుడు విశాఖ పట్టణం నుండి హైద్రాబాద్ ప్రయాణిస్తున్నాడు. మంగళవారం ఇద్దరి రూ.4 లక్షల 61 వేయి 100 లు తో పాటు బుధవారం రూ.2 లక్షల 30 వేలు, గురువారం రూ.2 లక్షల 19 వేలు. మూడు రోజుల్లో  నలుగురి నుండి మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.9 లక్షల 100 లు కు చేరింది.
Spread the love