- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
బహుజన రాజ్యాధికారం కోసం బహుజనులను ఐక్యం చేసేందుకు మంగళవారం మండల కేంద్రంలోని శివమ్ గార్డెన్ లో జరిగే తీన్మార్ మల్లన్న సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగారపు రవీందర్ బహుజనులకు పిలుపునిచ్చారు. సోమవారం పాలకుర్తిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిలుకాని మహేందర్ యాదవ్ తో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే తీన్మార్ మల్లన్న ధ్యేయమన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారం దిశగా రాబోవ స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు సత్తా చాటాలని సూచించారు.
- Advertisement -



