ఆలయ నిర్మాణానికి సునీల్ రెడ్డి చేయూత అభినందనీయం

– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ పెద్దవంగర:
మండలంలోని చిన్నవంగర గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠ మహేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పాకనాటి సునీల్ రెడ్డి ఆర్థిక చేయూతను అందించడం అభినందనీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. సోమవారం ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే పరమావధి పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభివృద్ధి కోసం అనేక సబ్సిడీ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనతి కాలంలోనే పాలకుర్తి నియోజకవర్గ రూపురేఖలు మార్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. భారీ మెజార్టీయే లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్, మండల నాయకులు శ్రీరామ్ సుదీర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి విజయ పాల్ రెడ్డి, నాయకులు జలగం శేఖర్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ గౌడ్, బొమ్మెర సోమన్న గౌడ్, యూత్ నాయకులు బొమ్మెర నగేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love