పోయిన పశ్చిమ దేశాల పరువు!

The honor of the lost West!– బట్టబయలైన ఐరోపా మిత్రదేశాల నిజస్వరూపం
రష్యాను ఉక్రెయిన్‌ దురాక్రమణదారుగా చిత్రించటానికి ప్రయత్నించిన అమెరికా, దాని పశ్చిమ ఐరోపా మిత్ర దేశాలు గాజాలో ఇజ్రాయిల్‌ కు వెనుకాముందు ఆలోచించకుండా మద్దతు పలకటంతో వాటి నిజ స్వరూపం వర్దమాన దేశాలకు మరోసారి తేటతెల్లమైంది. ఉక్రెయిన్‌ పైన ఎటువంటి కారణంలేకుండా రష్యా యుద్ధ ప్రకటన చేసిందని, సదరు యుద్ధంలో అనేకమంది అమా యక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పశ్చిమ దేశాలు ఆరోపించేవి. అయితే అవే దేశాలు ఇజ్రా యిల్‌ విషయానికి వచ్చేసరికి తొందరపాటు కూడ దని చెప్పకుండా తమ మద్దతును ప్రకటించాయి.
ఇజ్రాయిల్‌ పైన ఈ నెలారంభంలో హమస్‌ దాడి చేసిన తరువాత ఇజ్రాయిల్‌ జనావాసాలపైన, హాస్పిటల్స్‌ పైన విచక్షణారహితంగా బాంబుదాడులు చేస్తూ వేలాది ప్రజల ప్రాణ హననానికి పాల్పడు తోంది. అంతేకాకుండా 23 లక్షల ప్రజలు నివాస ముంటున్న గాజా ప్రాంతానికి నీరు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా అందకుండా అడ్డు పడుతోంది. ఈ దౌర్జన్య మారణకాండపైన నోరు విప్పకుండా ఇజ్రాయిల్‌కు మద్దతు పలకట మంటే వర్దమాన దేశాలకు రష్యా గురించి చెబుతున్న కట్టుకథలు వట్టి బూటకమని మరోసారి తేటతెల్లం అవుతోంది. ”వర్దమాన దేశాల హ్రుదయాలను గెలవటంలో మేము కచ్చితంగా విఫలమయ్యాం. ఉక్రెయిన్‌పై వర్దమాన దేశాలకు మేము చెప్పినదంతా వృథా అయింది. నియమాలను మర్చిపోండి. ప్రపం చ క్రమం గురించి మర్చిపోండి. మేము ఏమి చెప్పినా వర్దమాన దేశాలు ఇక వినవు. తాము ఉక్రెయిన్‌ గురించి చెప్పినది గాజాకు కూడా వర్తి స్తుంది. అలా జరగకపోతే మా ప్రతిష్ట మంటగలు స్తుంది. మానవ హక్కులను గౌరవించవలసిన అవసరం ఉందని మేం చెబితే బ్రెజిలియన్లు, దక్షిణ ఆఫ్రికా వాసులు, ఇండోనేషియన్లు ఎందుకు నమ్ముతారు?” అని జి-7 దేశాలకు చెందిన ఒక సీనియర్‌ దౌత్యవేత్త అన్నట్టు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది.
ఉక్రెయిన్‌లో నీరు, ఆహారం, విద్యుచ్చక్తి సరఫరాను నిలిపివేయటం యుద్ధ నేరం అయి నప్పుడు గాజాలో కూడా యుద్ధ నేరమే కావాలి కదా? అని ఒక అరబ్‌ అధికారి పశ్చిమ దేశాల ద్వంద వైఖరిని ప్రశ్నించాడు. అలాగే సిఎన్‌ఎన్‌ హౌస్ట్‌ జాక్‌ టప్పర్‌ ”ఎక్కడ నివసించినా పౌరులు పౌరులే కదా” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ని అడి గాడు. గాజాలోకి పౌర సరఫరాలను పునరుద్ద రించమని అమెరికా ఇజ్రాయిల్‌ పైన వత్తిడి తెచ్చే విషయంపైన తాను మాట్లాడదలచ లేదని ఆయన అన్నాడు.
మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి అమెరికా దౌత్యవేత్త లను మూడు పదబంధాలను వాడరాదని అమెరికా విదేశాంగ శాఖ నిర్దేశించినట్టు హఫ్పిం గ్టన్‌ పోస్టు రిపోర్ట్‌ చేసింది. ఆ మూడు ప్రత్యేక పదబంధాలు ఇలా ఉన్నాయి: కాల్పుల విరమణ లేక ఘర్షణ పెరగకుండా చూడటం (డిఎస్కలేషన్‌), హింసను విడనాడటం లేక రక్తపాతాన్ని ఆపమనటం, శాంతిని పున్ణస్థాపన చేయటం. పౌరులపై హింసను ఖండించి కాల్పుల విరమణ చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా ప్రతి పాదించిన తీర్మానం వీగి పోయింది. బ్రెజిల్‌ ప్రతిపాదించిన మరో తీర్మానాన్ని కూడా అమెరికా వీటో చేసింది.

Spread the love