– మైనంపల్లి రోహిత్
నవతెలంగాణ-నార్సింగి
ఎన్నికల్లో ఒకసారి తనను దీవించండని, ప్రజాసేవకే అంకితమవుతానని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలోని దుర్గామాత మండపంలో, హనుమాన్ దేవాలయంలో, గ్రామంలోని చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ పదవులు లేకున్నా ప్రజలకు తన తండ్రి సేవ చేశారని, అలాగే తాను కూడా ప్రజాసేవకే అంకితమవుతానన్నారు. ఒకసారి మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మెదక్‌లోనే ఉండి ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలను తీరుస్తానని తెలిపారు. డబ్బుల సంచులతో తాను వస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. తనను గెలిపిస్తే మెదక్ జిల్లాలోనే ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్, వార్డ్ సభ్యుడు నర్సింలు గౌడ్, డాక్టర్ నర్సింలు, చిన్న కష్ణా గౌడ్, చెల్కం మల్లేశం, చేప్యాల బాలాజీ, ఇళ్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.