పోలీస్ శాఖ క్యాండిల్ ర్యాలీ

నవతెలంగాణ కంటేశ్వర్:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2023 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్ ఆదేశాలతో గురువారం అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ గిరిరాజు ఆద్వర్యంలో జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీ పాత కలెక్టరేటు గ్రౌండ్ నుండి ప్రారంభించి – ఎల్.ఐ.సి చౌరస్తా – మున్సిపల్ ఆఫీసు – ఎన్.టి.ఆర్ చౌరస్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, రిజర్వుఇన్సెపెక్టర్స్ వెంకటప్పల నాయుడు, శ్రీపాల్ రావ్, వెంకటి, తిరుపతి, టౌన్ సి.ఐ నరహరి, టౌన్ 1 ఎస్. హెచ్. ఓ విజయ్ బాబు, సి.ఐలు, ఎస్.ఐలు 1,2,3,4,5,6, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love