Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు…

లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యదాద్రి భువనగిరి జిల్లా కార్మిక శాఖ , జిల్లా కోర్టు వారి ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు మంగళవారం రోజున నిర్వహించనున్నట్లు జిల్లా కార్మిక శాఖ అధికారి, సిఎస్ సి హెల్త్ కేర్ అధికారులు  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 10,000/(పదివేలరూపాయల) వరకు ఖర్చు అయ్యే 50రకాల టెస్ట్ లకు పైగా జరిపే ఈ వైద్య పరీక్షలనులేబర్  కార్డు కలిగిన వారికి ఉచితంగా అందించనున్నట్లు లేబర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 20వ తేదీన మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. లేబర్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో తీసుకొని రావాలని కోరారు. పూర్తి వివరాలకు యాదాద్రి జిల్లా కార్మిక శాఖ అధికారి, సిఎస్ సి హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్ టి సుభాష్ చంద్రబోస్ 98484 84067, డివిజనల్ మేనేజర్ సుమన్ ను సంప్రదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -