– జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న
నవతెలంగాణ-పాల్వంచ
ఆయిల్ పామ్ తోటలలో నల్ల కొమ్ము పురుగు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. శనివారం సుజాతనగర్, జూలూరుపాడు, చంద్రుగొండ, అన్నపూరెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో సాగులో వున్న ఆయిల్ పామ్ తోటలు, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలను సందర్శించిన అనంతరం రైతులకు పలు సూచనలు సాంకేతిక సలహాలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నల్ల కొమ్ము పురుగు ఆయిల్ పామ్, కొబ్బరి తోటలలో లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్ట పరుస్తుంది. నల్ల కొమ్ము పురుగు నుండి ఎప్పటికప్పుడు మొక్కలను కాపాడుకోవాలి. 20 గ్రాముల ఫోరేట్ గుళికలను మొవ్వలో పెట్టాలి. లింగాకర్షక బుట్టలు వాడాలి. జీవ నియంత్రణ పద్దతులు పాటించి నివారించుకోవాలి.