పోటీకి నిర్వాసితులు

Expatriates to compete– అదేబాటలో ఉద్యమకారులు
– హుస్నాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డిలో నామినేషన్లు వేసేందుకు సిద్ధం
– గౌరవెల్లి నిర్వాసితులకు అందని పరిహారం
– గుర్తింపునకు నోచని తెలంగాణ ఉద్యమకారులు
– నిర్వాసితులపై అక్రమ కేసులు
పోరాట రూపాలకు కాదేదీ అనర్హం అన్నట్టుగా బాధితులు ఎన్నికల్ని సైతం పోరాట ఆయుధంగా మార్చుకుంటున్నారు. పాలకుల చేత బాధించబడిన, నిర్లక్ష్యానికి గురికాబడిన బాధితులు ఎన్నికల వేళ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తమ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బ్యాలెట్‌ పోరాటం కొత్తదేమీ కాకపోయినా తాజా ఎన్నికల్లో చర్చనీయాంశం కాబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ సమస్య నుంచి విముక్తి చేయండంటూ నల్లగొండలో వందలాది మంది ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపారు. తెలంగాణలోనూ పసుపు రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేసిన విషయం విదితమే. తాజాగా సిద్దిపేట జిల్లాలో బాధితులు అలాంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన నిర్వాసితులు 100 మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవు తున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారులు కూడా 200 మంది వరకు నామినేషన్లు వేసి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సై అంటున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎన్నికల పోరుబాటకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంలో విఫలమైనందున ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌కు వ్యతిరేకంగా 100 మంది వరకు నిర్వాసితులు నామినేషన్లు వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వారు పలుమార్లు సమావేశమై భవిషత్‌ కార్యాచరణపై చర్చించారు. నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారు ఇప్పటికే అనేక రూపాల్లో పోరాడుతూ వచ్చారు. భూములకు మెరుగైన నష్ట పరిహారం, సర్వం కోల్పోయి నందుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పశువుల కొట్టాలు, ఇండ్ల స్థలాలకు పరిహారం రాని నిర్వా సితులున్నారు. హుస్నాబాద్‌ నియోజక వర్గంలోని అక్కన్నపేట మండలంలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చాలనే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మిం చారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.4 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. గుటాటిపల్లి, తెనుగుపల్లి గ్రామాలు, ఏడు తండాల పరిధిలో 3850 ఎకరాల భూమి సేకరించారు. అందులో కొంత మందికి నష్టపరిహారం అందలేదు. వివాహాలు అయి వెళ్లిపోయిన మహిళలకు పరిహారమివ్వడంలో జాప్యం జరిగింది. న్యాయం చేయాలని నిర్వాసితులు నడిపిన పోరాటంలో భాగంగా జరిగిన ఘర్షణలో అప్పటి హుస్నాబాద్‌ ఏసీపీ సతీష్‌పై దాడి చేశారన్న నెపంతో కేసులయ్యాయి. ఆ కేసుల్లో గుడాటిపల్లికి చెందిన బద్దం శంకర్‌రెడ్డి, అంగిటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీనివాస్‌, బుక్యా సక్రుపై వివిద సెక్షన్ల కింద కేసులయ్యాయి.
ఒకపక్క పరిహారం అందకపోవడం, మరోపక్క కేసుల పాలవ్వడంతో తీవ్ర ఆవేదనతో ఉన్న నిర్వాసితులు అధికార పార్టీ ఎమ్మెల్యేను ఓడించాలనే కసితో ఉన్నారు. 12 సంవత్సరాలుగా పోరాడుతున్నా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ విఫలమయ్యారనే భావనలో నిర్వాసితులున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడిస్తామని తెగేసి చెబుతున్నారు.
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతుల నిరసన
కేసీఆర్‌పై పోటీగా కామారెడ్డి నుంచి 100 నామినేషన్లు వేస్తామని మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రైతులు ప్రకటించారు. తమ భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా వెళ్తామని తెగేసి చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్‌ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై గత మంగళవారం సమావేశం నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ కాలేదని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను అనవసరంగా బదనాం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ సంబంధం లేని మాటలు మాట్లాడారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోనే తాము ఉద్యమ బాట పట్టామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మొన్న గజ్వేల్‌ కార్యకర్తలతో సీఎం మాట్లాడుతూ.. కామారెడ్డిలో తనకు పని ఉండటం వల్లే అక్కడికి వెళ్తున్నానని కేసీఆర్‌ చెప్పారని, కేసీఆర్‌కు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో భూములు అయిపోయాయి కాబట్టి ఇక్కడికి ఆ పనిమీదే వస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు రాములు ఆత్మహత్యలాంటి ఘటనలు మరోసారి జరగకముందే కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ ద్వారా మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాతే కేసీఆర్‌ కామారెడ్డికి రావాలని సూచించారు. లేకపోతే ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. దానికోసం రైతులందరం పార్టీలకు అతీతంగా సంఘటితం అవుతామని, నియోజకవర్గం మొత్తం కలియ తిరిగి కాళ్ళు మొక్కి అయినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌కు నిర్వాసితులు, ఉద్యమకారుల టెన్షన్‌
హుస్నాబాద్‌లో నిర్వాసితులు, సిద్దిపేటలో ఉద్యమకారులు.. వందల సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతుండటంతో బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే రోడ్‌ రోలర్‌ గుర్తు వల్ల గత ఎన్నికల్లో చేదు ఫలితాల్ని చవిచూసిన బీఆర్‌ఎస్‌ ఈసారి ఎక్కువ మంది నామినేషన్లు వేస్తుండటంతో ఏ రూపంలో నష్టం వాటిళ్లుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. హుస్నాబాద్‌లో 100 మంది, సిద్దిపేటలో 200 మంది వరకు నామినేషన్లు వేస్తే వారందరికీ గుర్తులు కేటాయించాల్సి వస్తది. అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయిస్తే ఎక్కువ మొత్తంలో ఈవీఎంలను పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఈవీఎంలను పెడితే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కారు గుర్తును వెతుక్కుని ఓటు వేయడం ఓటర్లకు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సిద్దిపేటలో ఉద్యమకారుల తిరుగుబాటు
సకల జనులు పోరాడితే వచ్చిన తెలంగాణలో ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు విలువలేదనే భావన బలంగా ఉంది. స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడిన, ప్రాణాలిచ్చిన వాళ్ల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఎగసిపడిన పలు ప్రాంతాల్లో సిద్దిపేట ముందుంటది. ఆ ప్రాంతం నుంచి అనేక మంది తెగించి పోరాడినోళ్లున్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్లు ఉన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదికగా ఏర్పడి పనిచేస్తున్నారు. తెలం గాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 200 మంది పోటీ చేసేందుకు నామినేషన్లు వేయాలని నిర్ణయిం చారు. మంత్రి హరీశ్‌రావును ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు. న

Spread the love