– ఏపీజీవీబీ అధికారులు నేహా, సుధీర్‌కుమార్
నవతెలంగాణ-సత్తుపల్లి
లంచగొండి తనం అనేది అతిపెద్ద ప్రమాదకరమైన జబ్బు అని ఏపీజీవీబీ భద్రాచలం రీజియన్ అధికారులు బి.నేహా, బి.సుధీర్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీజీవీబీ సత్తుపల్లి బ్రాంచి మేనేజర్ జి ప్రశాంత్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రి కళాశాలలో సోమవారం లంచం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీని నిర్వహించి ప్రతిభ కనపబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నేహా, సుధీర్‌కుమార్ మాట్లాడుతూ లంచ అనేది దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తుందన్నారు. లంచగొండి తనాన్ని నిర్మూలించడానికి యువత కృషి చేయాలన్నారు. లంచ తీసుకుంటున్న సమాచారాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారులకు, సెంట్రల్ విజిలెన్స్ కమిటీ అధికారులకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందించడం ద్వారా లంచం తీసుకోవడమనేది క్రమేపీ రూపుమాపవచ్చన్నారు. కార్యక్రమంలో గాయత్రి కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ సుబ్బారావు, ఏపీజీవీబీ అధికారులు, స్థానిక బ్యాంకు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.