పాయం సీనియర్లను కలుపుకొని పోవాలి

నవతెలంగాణ-మణుగూరు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు వంటెద్దు పోకడలు మానుకొని సీనియర్‌ నాయకులను కలుపుకొని పోవాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు గురజాల గోపి అన్నారు. సోమవారం మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గోపి నాయకత్వంలో కమలాపురం గ్రామస్తుల సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. కమలాపురం కమిటీ అధ్యక్షుడిగా మునిగేళ్ల లక్ష్మయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌గా సొంతపురి కొండబాబు, జనరల్‌ సెక్రటరీగా గుమ్మల వెంకటేశ్వర్లు, జాయింట్‌ సెక్రటరీగా మునిగల వెంకటేశ్వర్లు, కమలాపురం మహిళా గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా గుమ్మల లక్ష్మి, వైస్‌ ప్రెసిడెంట్‌గా గుమ్మల దుర్గ, జనరల్‌ సెక్రటరీగా వాసం రమణ, జాయింట్‌ సెక్రటరీగా శ్యామల నర్సమ్మలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమలాపురం గ్రామస్తులు మాట్లాడుతూ మాకు పక్క ఇండ్లు నిర్మించి పరిష్కారం చూపించే నాయకులే గ్రామంలోనికి వచ్చి ఓట్లు అడగాలని అన్నారు. అనంతరం గోపి మాట్లాడుతూ రాబోయే రోజులలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కమలాపురం గ్రామస్తులకు పక్క ఇండ్లు నిర్మించి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎండి నూరుద్దీన్‌, బూర్గుల కిరణ్‌ మోహన్‌, సురేష్‌, షబ్బీర్‌, ముత్తయ్య, కిషన్‌ నాయక్‌, మాధవరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love