- Advertisement -
నవతెలంగాణ-కొండాపూర్
కొండాపూర్ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కొండాపూర్ ఎంపిటిసి, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేలు నరసింహారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని ఆ ఏసు ప్రభును ప్రార్థించారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభిం చాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
- Advertisement -



