
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని,ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి గొంగడి సునీత ఎంతో కృషి చేశారని. ఎంపీపీ సుధీర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ బాల్ నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిపెస్టోపై ఓటర్ల ప్రతిస్పందనను అడిగి తెలుసుకున్నారు. కెసీఆర్ గతంలో మ్యానిపెస్టో లో చెప్పని రైతుబందు, రైతుభీమా, కల్యాణలక్ష్మి లాంటి స్కీంలను తీసుకువచ్చారని, ఇప్పుడు మ్యానిపెస్టో లో ఇచ్చిన హామీల పట్ల ఓటర్లు భరోసా తో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి గొంగడి సునీత మహేందర్ రెడ్డిని మూడవసారి గెలిపించాల అన్నారు. కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగుల సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కుదూగు ఉపేందర్, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, సెక్రెటరీ గుర్రాల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మైలారం రామకృష్ణ, కుక్కుదూగు గణేష్, బండి మహేష్ గౌడ్,కట్ట శ్రీకాంత్ గౌడ్, బోనకుర మల్లేష్, శాంతి చారి, వేణు యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.