Saturday, December 27, 2025
E-PAPER
Homeసినిమాన్యూ ఇయర్‌ కానుకగా రిలీజ్‌

న్యూ ఇయర్‌ కానుకగా రిలీజ్‌

- Advertisement -

హర్ష గంగవరపు, ఇయనా సుల్తానా, అనురూప్‌, లతా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మదం’. హార్డ్‌ హిట్టింగ్‌ డ్రామా థ్రిల్లర్‌గా దీన్ని ఏకైవా హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్‌ (చినబాబు), రమేష్‌బాబు కోయ నిర్మించారు. వంశీ మల్లా దర్శకత్వం వహించారు. నూతన సంవత్సర కానుకగా ఈచిత్రాన్ని జనవరి 1వ తేదీన మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బలమైన ఎమోషన్స్‌తో సాగే, రాజీలేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈసినిమాను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. ఇంటెన్స్‌ సన్నివేశాలు, బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా సెన్సార్‌ బోర్డ్‌ దీనికి ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దీనికి కథ, మాటలు : నిర్మాత రమేష్‌బాబు కోయ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -