- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో నిర్వహించబడుకున్న క్రిస్మస్ వేడుకలు -2025. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి రూ.2 లక్షలతో క్రైస్తవులకు విందు కార్యక్రమం, నియోజకవర్గానికి 50 చర్చిలకు రూ.30 వేల చొప్పున భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు 100 చర్చిలకు 30 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. రిజిస్టర్ అయిన చర్చిలకు నిధులు విడుదల చేయడం జరిగిందనారు.భువనగిరి మండల విందు కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, తహసిల్దార్, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



