- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం కొడిచిర గ్రామ శివారులో పొలంలో బుధవారం ఉదయం ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు ఆవు మృతి చెందినట్లు రైతు బేతె సంజు తెలిపారు. ఆవు విలువ సుమారు రూ. 35వేలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని రైతు బేతె సంజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
- Advertisement -