- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గుండేటి లక్ష్మీబాయికి రూ.25000/- రూపాయల చెక్కు మంజూరు అయ్యింది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జలాల్ పూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ మూగ భోజన్న, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



