- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం తనకుర్డు (తాడేం) గ్రామ సర్పంచిగా ఇటీవల ఎన్నికైన కుచన్ పల్లి జలంధర్ రెడ్డిని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మండలంలోని 21 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు కుచన్ పల్లి జలంధర్ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ఐక్యతతో మండల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సన్మాన కార్యక్రమంలో లోలం మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్ తోట మల్లేష్‌తో పాటు జర్నలిస్టులు బైరి శేఖర్, గంగారెడ్డి, గాధరి సంజీవ్ రెడ్డి, సిరిగాద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



