- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని జీకే తాండ సర్పంచ్ లౌడ్య శిరీష మహిపాల్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం జీకే తండా గ్రామపంచాయతీ పరిధిలోని దర్పల్లి- ఇందల్ వాయి మెయిన్ రోడ్ నుండి జీ కే తండా వరకు ఉన్న బి టి రోడ్ కు ఈరు వైపులా ఉన్న ముళ్ళ పొదలను, ములా మలుపుల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో తొలగించినట్లు శిరీష మహిపాల్ నాయక్ తెలిపారు. పోదల తొలగింపుతో రహదారి ఇరువైపులా బాగుయిందని తాండవాసులు తెలిపారు. రాబోవు రోజుల్లో కూడా ఇలాగే అభివృద్ధి పనులను పరుగులు పెట్టేస్తామని, ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించాలని వారి నమ్మకాన్ని నిలబెడతామని పేర్కొన్నారు.
- Advertisement -



